: రాజ్యసభ సోమవారానికి వాయిదా
రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వాయిదా పడిన సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమవగానే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దాంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.