: ఎంపీల ఆరోగ్యం ఓకే: వైద్యులు
పార్లమెంటులో పెప్పర్ స్ప్రే తో అస్వస్థతకు లోనైన ఎంపీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. గాయపడిన పొన్నం ప్రభాకర్, లగడపాటి రాజగోపాల్ తోపాటు, వినయ్ కుమార్ పాండే, బలరాంనాయక్ తదితరులకు పార్లమెంటు ఆవరణలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖం, కళ్లు, నోటిపై మంటతో తమ వద్దకు ముగ్గురు ఎంపీలు వచ్చారని, వారికి వైద్యం అందించినట్లు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ హెచ్ఎస్ ఖర్ తెలిపారు.