: బిల్లు పెట్టకముందే సభనుంచి వెళ్లి పోయిన జగన్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో పెట్టినప్పుడు ఎంపీ జగన్మోహన్ రెడ్డి లేరు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే ప్లకార్డుతో వచ్చిన జగన్.. సీమాంద్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తుండటంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దాంతో, బిల్లు పెట్టకముందే సభ నుంచి ఆయన నిష్క్రమించారు.