: ఇదంతా కాంగ్రెస్ కుట్రలో భాగమే: వెంకయ్యనాయుడు
పార్లమెంటులో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలే వెల్ లోకి దూసుకొస్తున్నారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. సొంతపార్టీ నేతలే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. గత మూడు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదంగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమేనని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులే ఒకరిపై మరొకరు కలబడటం విచారకరమైన అంశమని చెప్పారు. జరిగిన ఘటనకు యూపీఏ సర్కారే బాధ్యత వహించాలని అన్నారు.