: లోక్ సభలో ఘటనకు కారణమైన ఎంపీలపై చర్యలు: షిండే
విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర పరిస్థితులు సృష్టించేందుకు కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, లోక్ సభలో చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని, హోంమంత్రితో చర్చిస్తామన్నారు. సభలో సభ్యులను చంపేందుకు చేసిన కుట్రగా దీనిని భావిస్తున్నామన్నారు.