: సీమాంధ్ర ఎంపీలపై దాడి... కాంగ్రెస్ ప్రణాళికే!
లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీదే అన్న సమాచారం వస్తోంది. బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు అడ్డుకుంటారని భావించిన కేంద్ర మంత్రి కమల్ నాథ్... సీమాంధ్ర ఎంపీలను అడ్డుకోవాలని ముందుగానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ తదితర పార్టీల ఎంపీలను సమాయత్తం చేసినట్టు సమాచారం. దాంతో, వారు సీమాంధ్ర ఎంపీలపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. పథకం ప్రకారమే హోంమంత్రి షిండే, స్పీకర్ కు రక్షణగా ఎంపీలను నిలిపి బిల్లును ప్రవేశపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.