: టీడీపీకి ప్రజలే అండగా నిలవాలి: బాబు
రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ పాలనపై ఉద్యమించిన తెలుగుదేశం పార్టీకి ప్రజలే అండగా నిలవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈరోజు సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించిన బాబుకు పార్టీ శ్రేణలు ఘనస్వాగతం పలికాయి.
గోదావరి నదిపై కొవ్వూరు-రాజమండ్రి మధ్య 4 కిమీ పొడవున్న వంతెన పసుపు మయమైంది. బాబు గోదావరి ఘాట్ వద్ద పూజలు నిర్వహించి వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం రాష్ట్రాన్నే దోపిడీ చేసిందని ఆరోపించారు.
వ్యాట్ ఎత్తివేయాలంటూ శాంతియుతంగా నిరసిస్తున్న వస్త్ర వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, బాబు తూర్పు గోదావరి జిల్లాలో 14 రో్జుల పాటు పాదయాత్ర చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.