: ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజు: మోదుగుల
ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలో తనపై ఎనిమిది మంది ఎంపీలు దాడి చేసేందుకు వచ్చారని, అప్పుడు తమ పార్టీ ఎంపీలు తనను కాపాడేందుకు వచ్చారన్నారు. అయితే, తన చేతిలో ఉన్నది చాక్ కాదు మైక్ అని చెప్పారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ వద్ద మైక్ లాక్కున్నానని మోదుగుల వివరించారు.