: ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే: హర్షకుమార్
ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్ప్రే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేస్తుంటే తాము అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా లగడపాటిపై దాడికి యత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే ఉపయోగించారని హర్షకుమార్ అన్నారు. తమ దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటేనని, ప్రజల కోసమే తాము అలా చేశామని ఆయన పేర్కొన్నారు. మరో వైపు లగడపాటి స్ప్రే చేయడంతో పలువురు ఎంపీలకు దగ్గు, కళ్ల నుంచి నీళ్లు రావడంతో భయంతో బయటకు పరుగులు చేశారు. అస్వస్థతతో ఉన్న ఎంపీలను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.