: నా 33 ఏళ్ల చరిత్రలో ఇలాంటిదెన్నడూ చూడలేదు: కమల్ నాథ్
పార్లమెంటులో ఈ రోజు జరిగిన ఘటన ఓ హేయమైన చర్య అని... ప్రజాస్వామ్యానికే కళంకం అని కేంద్ర మంత్రి కమల్ నాథ్ అన్నారు. తన 33 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని... ఘటనపై తామంతా సిగ్గుపడుతున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు కోరారని వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కే ఉందని తెలిపారు.