: ఇవాల్టి ఘటనను తేలిగ్గా తీసుకోవద్దు: శరద్ యాదవ్
లోక్ సభలో ఈ రోజు రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో చోటు చేసుకున్న సంఘటనలపై జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో నేడు చోటుచేసుకున్న ఘటనను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. పార్లమెంటు సభ్యుల పట్ల సభలో ఇలాగా ప్రవర్తించేది? అని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన సంఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు శరద్ యాదవ్ తెలిపారు.