: వాళ్ళ సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైంది: కెసీఆర్
ఈ రోజు పార్లమెంటులో సీమాంధ్ర సభ్యుల ప్రవర్తన చాలా సిగ్గుచేటు, అమానుషమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర సభ్యులు చేసిన పనుల్ని దేశం యావత్తూ వీక్షించిందని ఆయన తెలిపారు. 'మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారో ఇప్పుడు మాకర్థమైందని' ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి నాయకుడూ తమతో అన్నారని కేసీఆర్ చెప్పారు. ఈ సమయంలో అందరూ సంయమనంతో వుండాలని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందని కేసీఆర్ అన్నారు.