: లోక్ సభలో పెప్పర్ స్ప్రే కొట్టిన లగడపాటి
లోక్ సభ నేడు గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడింది. రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టగానే ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ ఆందోళనకు దిగడంతో తెలంగాణ ఎంపీలు లగడపాటిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేయడంతో దుర్వాసన రావడంతో భరించలేక ఎంపీలు పరుగులు తీశారు. కాగా, బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే లోక్ సభ వాయిదాపడింది.