: సాధువకు కలగంది బంగారు నిధిని.. దొరికింది గాజులు
గతేడాది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ సాధువు.. ఫలానా కోటలో వెయ్యి టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తనకు కలలో తెలిసిందని ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ సాధువు ఎంతో మహిమాన్వితులని స్థానికుల నమ్మకం. ఆయన చెప్పింది జరుగుతుందనే గుడ్డి విశ్వాసం. దేశ విదేశీ మీడియా వాళ్లు ఆయన చెప్పిన విషయాలను కవర్ చేశారు. సాధువు పలుకుబడితో కేంద్ర మంత్రి ఒకరు బంగారు నిక్షేపాల సంగతేంటో చూడాలని పురావస్తు శాఖను ఆదేశించారు. వారు గతేడాది అక్టోబర్ 18న రంగంలోకి దిగారు. ఉన్నవ్ జిల్లాలోని రాజారావ్ రాంభక్ష్ సింగ్ కోటలో రోజుల తరబడి తవ్వకాలు జరిపారు. నవంబర్ 14న ముగించారు. చివరికి దొరికింది బంగారం కాదు.. సీసం గాజులు, ఇనుప చువ్వలు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చంద్రేశ్ కుమారి కటోచ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'సాధువు ఎంత పని చేశాడు.. ఎంత మందిని బోల్తా కొట్టించాడు' అని పలువురు అనుకుంటున్నారు.