: అవిశ్వాసం నోటీసివ్వను.. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయను: కావూరి
తాను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. అంతేకాదు, ఇతరులు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా కూడా ఓటు వేయనని తెలిపారు. అయితే, రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చర్చ లేకుండానే బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.