: వరంగల్ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు!


వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో ఉన్న మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో విగ్రహం పూర్తిగా కాలిపోయింది. స్థానికులే ఆ పని చేసినట్లు అక్కడివారు చెబుతున్నారు. అటు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే అక్కడికి వెళ్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News