: హైవేలు ఫుల్.. నగరాలు నిల్
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో బంద్ పాటిస్తుండడంతో 13 జిల్లాల సరిహద్దుల్లోని హైవేలు స్థంభించాయి. సమైక్యవాదులు జాతీయ రహదారులపై టైర్లకు నిప్పంటించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారులపై పోలీసులు పహారా కాస్తున్నా సమైక్యవాదులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 13 జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ బోసి పోయాయి. ప్రజలు స్వచ్ఛందగా బంద్ చేస్తూ నిరసన తెలపడంతో పట్టణాల్లో వాహన సంచారం లేకుండా పోయింది. ప్రజలు కూడా విధులకు దూరంగా ఉండి బంద్ కు సహకరిస్తున్నారు. దీంతో సీమాంధ్రలోని ప్రధాన పట్టణాల్లోని రోడ్లన్నీ వాహన సంచారం లేక బోసిపోయాయి. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడుతుండగా, నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.