: బిల్లుపై కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు


తెలంగాణ బిల్లుపై హైటెన్షన్ కొనసాగుతోంది. అసలు బిల్లు పార్లమెంటు ముందుకు నేడు వస్తుందా? రాదా? అనే దానిపై స్పష్టత లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానిపై చర్చిస్తున్నామని అన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని, ఈ రోజే ప్రవేశపెట్టకపోతే సోమవారం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కమల్ నాథ్ తెలిపారు. చర్చ జరిగిన తరువాత బిల్లు ప్రవేశపెట్టే అంశంపై పూర్తి స్పష్టత ఇస్తానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News