: బంద్ నేపథ్యంలో స్థంభించిన సీమాంధ్ర


సీమాంధ్ర స్థంభించింది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తున్నారు. అన్ని పనులను వాయిదా వేసుకుని బంద్ ను విజయవంతం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఏపీఎన్జీవోలు బస్సులను డిపోలను దాటనీయలేదు.

నిరసన తెలుపుతూ పలు కూడళ్లలో టైర్లను తగులబెట్టారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన అన్ని ప్రాంతాలు, కూడళ్లలో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఉద్యోగ సంస్థలు మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News