: ప్రధానికి ఆ అర్హత లేదు: సబ్బంహరి
రాష్ట్ర విభజన మంచిది కాదని చెప్పిన ప్రధాని మన్మోహన్ సింగ్ తన హృదయం గాయపడిందని చెప్పడం సహేతుకం కాదని ఎంపీ సబ్బంహరి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తనకు ఇష్టం లేకపోయినా, తప్పని తెలిసినా పార్టీ నిర్ణయం తీసుకుంది కనుక దానిని శిరసావహిస్తానని చెప్పిన ప్రధానికి హృదయం గాయపడిందని చెప్పే అర్హత లేదని అన్నారు. తాము చెప్పిన పరిష్కారాల వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ పార్టీకి తమను తప్పు పట్టే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకునేందుకు తాము ఎంతకైనా తెగించే అవకాశం ఉందని సబ్బం తెలిపారు.