: కుబేరులే.. కానీ పైసా విదల్చరు!
భారత్ లో కోటీశ్వరులకు కొదవలేదన్నది జగద్విదతమే. మొత్తం 55 మంది బిలియనీర్లతో భారత్ ఫోర్బ్స్ జాబితాలో తాజాగా ఐదోస్థానంలో నిలిచింది కూడా. టాటాలు, బిర్లాలు, అంబానీలు, సింఘానీలు.. ఇలా ఎందరో అపర కుబేరులు ఉన్నా.. వారు తమ దాతృత్వాన్ని చాటుకున్న సందర్భాలు చాలా అరుదు.
ఇదే విషయాన్ని చెబుతూ, భారత కుబేరులు పేదలకు సాయం చేయడంలో పిసినారులని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ 'బెయిన్ అండ్ కంపెనీ' విశ్లేషించింది. 2011లో భారత సంపన్నులు తమ ఆదాయంలోంచి 3.1 శాతం నిధులను ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారని.. అదే, అమెరికాలో 9.1 శాతం నిధులు దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించరని సదరు కన్సల్టెన్సీ వెల్లడించింది.
భారత్ లో బిలియనీర్లు ఉన్నత స్థానానికి ఎగబాకడంలో వేగం కనబరుస్తారని.. అయితే, సేవా గుణం అలవర్చుకోవడంలో మాత్రం నత్తనడకే అని విశ్లేషకులు అంటున్నారు.