: ఉద్యోగంలోకి తీసుకోలేదని.. వింత పని చేశాడు
ఆయన వయసు 58 ఏళ్లు. పేరు జెవాన్స్ బ్రౌన్. ఉండేది అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం.. సెయింట్ లూయిస్ నగరంలో. సైన్యంలో చేసి రిటైరయ్యాడు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, సదరు కంపెనీ బ్రౌన్ దరఖాస్తును తిరస్కరించింది. పెద్దాయనకు ఒళ్లు మండిపోయింది. 'అన్ని అర్హతలు ఉన్నా తిరస్కరిస్తార్రా?' అంటూ కళ్ళెర్ర జేశాడు. వెంటనే ఆయనకు ఓ ఐడియా వచ్చింది. పిల్లి పెంట సేకరించాడు. బ్యాగులకొద్దీ.. చక్కగా ప్యాక్ చేశాడు. తనకు ఉద్యోగాన్ని తిరస్కరించిన కంపెనీ ఉద్యోగులకు పోస్ట్ చేశాడు. అలా 20 కవర్లలో పంపాడు. నేరం నిరూపితం కావడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.