: మోడీ ఛాయ్ పై ప్రతాపం చూపిన లాలూ
వ్యంగ్యాస్త్రాలను సంధించడంలో ఆరితేరిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తన విమర్శల ప్రతాపం చూపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, మోడీ ఛాయ్ ఎక్కడమ్ముతాడు... అతను రక్తాన్ని మత ఘర్షణలకు అమ్ముతాడని మండిపడ్డారు. అసలైన ఛాయ్ వాలా తానేనని..మోడీ కాదని లాలూ తెలిపారు. తన బాల్యంలో పాట్నాలో ఛాయ్ అమ్మానని అన్నారు. తన చిన్నతనంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఓ షాప్ వద్ద తన సోదరులతో కలిసి ఛాయ్ అమ్మానని లాలూ తెలిపారు. రైళ్లలో మోడీ ఛాయ్ అమ్మారనే అంశంపై లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు.