: హైదరాబాదులో పరుగులు తీయనున్న డబుల్ డెక్కర్ రైళ్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాదు పట్టాలపై డబుల్ డెక్కర్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. రెండంతస్తుల రైళ్లను జంట నగరాల నుంచి నడిపేందుకు ప్రణాళికలు రూపొందాయి. ఈ సారి రైల్వే బడ్జెట్ లో ప్రకటించిన రెండు డబుల్ డెక్కర్ రైళ్లను మనకే కేటాయించడం విశేషం. కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు మధ్య ఈ డబుల్ డెక్కర్ రైళ్లను నడపనున్నారు. వారానికి రెండు రోజులు ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి.