: మీరాజాస్మిన్ కి పెళ్లైపోయింది
తమిళ, తెలుగు, మళయాళ చిత్రసీమల్లో మంచి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటీమణి మీరాజాస్మిన్ పెళ్లి నిరాడంబరంగా తిరువనంతపురంలోని ఓ చర్చిలో జరిగింది. అనిల్ జాన్ టైటస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను మీరాజాస్మిన్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు అతి కొద్దిమంది ఆత్మీయ అతిథులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి సురేష్ గోపి, మాధవన్ నాయర్ మరికొంత మంది హాజరయ్యారు. కాగా పెళ్లి రిజిస్ట్రేషన్ గత ఆదివారమే పూర్తయింది. కోచిలోని మీరాజాస్మిన్ ఇంట్లో రిజిస్ట్రార్ వధూవరులతో సంతకాలు చేయించినట్టు సమాచారం.