: అటు సీబీఐ.. ఇటు ఈడీ.. ఉక్కిరిబిక్కిరవుతున్న విజయసాయి!
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు, అటు సీబీఐ నుంచి ఇటు ఈడీ నుంచి, విచారణ తాలూకు ఒత్తిళ్ళతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండో ఛార్జిషీటు నుంచి తనపేరు తొలగించాలని నేడు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డిని.. విచారణ కోసం ఢిల్లీ పంపాలంటూ ఈడీ కోరింది. ఈమేరకు జగతి పబ్లికేషన్స్ కు నోటీసులు పంపింది. ఏప్రిల్ 2న ఈ విచారణ ఉంటుందని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలంటూ సీబీఐ కోర్టులో విజయసాయి మరో పిటిషన్ దాఖలు చేయాల్సివచ్చింది.