: ఒక్క ఎంపీ కూడా లేని.. ఆ పార్టీ నేతలతో విందు రాజకీయాలా?
తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులతో ప్రధాని మన్మోహన్ విందు రాజకీయాలు చేయడంపై వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా ఆ పార్టీ అభిప్రాయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని బలిపీఠంపై పెట్టారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జూపూడి చెప్పారు. విభజన బిల్లు మంటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మాడి మసైపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఆయన తేల్చి చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ను 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఎప్పుడైనా జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.