: బిల్లుపై చర్చ లేకుండా పాస్ చేయడం సరైంది కాదు: ప్రధానితో బీజేపీ నేతలు


ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి బీజేపీ నేతలు అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ సహా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హాజరైన విషయం విదితమే. ఈ సమావేశంలో తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధాని మన్మోహన్ బీజేపీ నేతలను కోరారు. అందుకు వారు.. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతే బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. ఆ విషయాలను మీడియాకు వెల్లడించారు.

సీమాంధ్ర సమస్యలను పరిష్కరించేందుకు 32 సవరణలు చేశామని బీజేపీ నేతలు చెప్పారు. తెలంగాణ సమస్యను ఇప్పుడు పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ కొనసాగుతుందని వారు తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో సభను అదుపు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని వారు ప్రధానికి సూచించారు. అలాగే సీమాంద్రలో కొత్త రాజధానిని తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు చెప్పారు. పెద్ద పట్టణాల అభివృద్ధికి నిధులను కేటాయించాలని వారు తెలిపారు. అలాగే చారిత్రాత్మక బిల్లుపై సభలో చర్చ జరుగకుండా పాస్ చేయడం మంచిది కాదని కూడా వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News