: ఫేస్ బుక్ బాటలో ట్విట్టర్
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ కూడా ఫేస్ బుక్ బాటలో నడవాలని నిశ్చయించుకుంది. తన హోమ్ పేజిని ఫేస్ బుక్ హోం పేజి స్ఫూర్తిగా రీడిజైనింగ్ చేయించేందుకు కసరత్తులు చేస్తోంది. తద్వారా మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఉత్సాహం చూపుతోంది. ఎడమవైపున అవతార్ ఫొటో, బయాగ్రఫీ.. మిగతా స్పేస్ హెడర్ ఫొటో కోసం.. ఇలా ఉండనుంది ట్విట్టర్ సరికొత్త హోం పేజీ డిజైన్. తద్వారా ట్వీట్లను మరింత స్పేషియస్ గా చూసుకునేందుకు కొత్త డిజైన్ తో వీలవుతుంది. ఇది డెస్క్ టాప్ వెర్షన్ అని, మొబైల్ ట్విట్టర్ పేజీ మునుపటిలానే ఉంటుందని తెలుస్తోంది.