: పార్లమెంటును స్థంభింపజేయండి: అశోక్ బాబు
పార్లమెంటును స్థంభింపజేయాలని సీమాంధ్ర ఎంపీలకు ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాము చేసే ఆఖరి పోరాటానికి జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలపాలని కోరారు. రేపు పిలుపునిచ్చిన సీమాంధ్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆయన సూచించారు.