: భారత్ ను పరాజయ భారంతో తిప్పి పంపుతాం: సౌథీ
న్యూజిలాండ్ ప్రధాన పేసర్ టిమ్ సౌథీ రెండో టెస్టుకు ముందు టీమిండియాపై వాగ్బాణాలు విసురుతున్నాడు. ధోనీ సేనను పరాజయ భారంతో తిప్పి పంపుతామని, రెండో టెస్టులోనూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ ను 0-4తో కోల్పోయిన భారత్ తొలి టెస్టులో 40 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ పర్యటనలో పరువు నిలుపుకోవాలంటే చివరిదైన రెండో టెస్టు మ్యాచ్ లో గెలవకతప్పదు. ఈ మ్యాచ్ శుక్రవారం నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో సౌథీ మాట్లాడుతూ, క్లీన్ స్వీప్ పై దృష్టి సారించామని తెలిపాడు.