: జగన్ సిగ్గుందా?.. ఏం చేస్తున్నావో తెలుస్తోందా?: సీఎం రమేష్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'జగన్... ఢిల్లీలో నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతోందా?' అని ప్రశ్నించారు. 'సీట్ల కోసం సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడుస్తావా?' అని మండిపడ్డారు. 'కొన్ని పార్టీల నేతలను కలుస్తూ విభజనకు అడ్డుపడవద్దని అడగడానికి సిగ్గేయడం లేదూ?' అని నిలదీశారు. జగన్ ఎవర్ని కలసి ఏం మాట్లాడుతున్నాడో తమకు తెలుసని ఆయన అన్నారు. విభజిస్తే కొన్ని సీట్లైనా వస్తాయని భావించడం సరికాదని జగన్ కు సీఎం రమేష్ హితవు పలికారు.