: జనసంద్రంగా మారిన మేడారం.. గద్దె పైకి రానున్న సారలమ్మ


మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో మేడారం జనసంద్రంగా మారింది. మేడారానికి వెళ్లే భక్తులతో రోడ్లన్నీ నిండిపోయి ఇవాళ ఉదయం హన్మకొండ నుంచి మేడారానికి వెళ్లే మార్గంలో వాహన రాకపోకలను కూడా నిలిపివేశారు. హన్మకొండ నుంచి గూడెప్పాడు, పరకాల మీదుగా మేడారం ప్రాంతానికి వాహనాలను దారి మళ్లించారు.

‘మేడారం’ మహా జాతరకు గిరిజనులందరూ వచ్చి సమ్మక్క-సారలమ్మను దర్శించుకొంటారు. ఈ జాతర తొలి రోజైన ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మను గద్దె పైకి తీసుకొచ్చేందుకు ఆలయ పూజారులు బయల్దేరి వెళ్లారు. కన్నెపల్లి నుంచి గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో సారలమ్మను మేడారానికి తీసుకొస్తున్నారు. కన్నెపల్లి, జంపన్న వాగు మీదుగా ఊరేగింపుతో తీసుకువచ్చి సారలమ్మను గద్దె పైన ప్రతిష్టిస్తారు. అనంతరం పగిడిద్దరాజును గద్దె పైకి చేర్చే కార్యక్రమం ఉంటుంది. నిన్న రాత్రి పూనుగొండ్ల అటవీ ప్రాంతం నుంచి నాగపడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన మేడారానికి బయల్దేరిన సంగతి తెలిసిందే. ఇవాళ రాత్రికి పగిడిద్దరాజును మేడారం తీసుకురానున్నారు.

  • Loading...

More Telugu News