: లోక్ సభలో బిల్లు పెట్టేందుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బిల్లు లోక్ సభలో పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. బిల్లుకు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరంలేదని లోక్ సభ సెక్రటరీ జనరల్ కు వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనుంది.