: పానాసోనిక్ నుంచి రెండు చవక ఫోన్లు


జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్ భారత్ లో తన మొబైల్ ఫోన్లకు మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే తక్కువ ధరకే ఓ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన పానాసోనిక్ తాజాగా కారుచవకగా ఈజెడ్-180, ఈజెడ్-240 మోడళ్ళను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.1350, రూ.1790 గా నిర్ణయించారు. కంపెనీ వర్గాలు మాట్లాడుతూ, ఈ రెండు బడ్జెట్ ఫోన్లలో మెరుగైన బ్యాటరీ, హిందీ భాషా సదుపాయం, మొబైల్ ట్రాకర్, యాప్ ప్రైవసీ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. దిగువ శ్రేణి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ రెండు మోడళ్ళను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News