: జైపాల్ రెడ్డికి డీకే అరుణ ఝలక్!


గతంలో ఓసారి హైదరాబాద్ మెట్రో రైల్ కార్యక్రమం శంకుస్థాపనకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఆయన పాల్గొంటున్న ఓ కార్యక్రమానికి హాజరు కాకూడదని రాష్ట్ర మంత్రి డీకే అరుణ నిర్ణయించుకున్నారట! అప్పట్లో మెట్రో రైల్ కార్యక్రమానికి జైపాల్ రెడ్డికి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. దాంతో ఆయన మనస్తాపం చెంది ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

పైగా, సీఎం కిరణ్ తో జైపాల్ రెడ్డికి వున్న విభేదాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ సన్నిహిత వర్గమని పేరుపడ్డ అరుణ తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 24న జరగనున్న గ్రామీణ నీటి పథకం ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టేందుకే నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి జైపాల్ రెడ్డి కూడా హాజరవుతారు.

పంచాయత్ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈయన జైపాల్ రెడ్డికి సన్నిహితుడన్న పేరుంది. జానాకు కిరణ్ కు పొసగదు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి కిరణ్ వద్ద మార్కులు కొట్టేయాలన్నది అరుణ ఉద్ధేశంగా కనిపిస్తోంది. 

  • Loading...

More Telugu News