: రాష్ట్ర విభజనపై అమీషా పటేల్ ట్వీట్లు


ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ తెగ ఆసక్తి కనబరుస్తోంది. రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్ర, కుతంత్రాల్ని అడ్డుకోవడంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆయనను తప్పక అభినందించాల్సిందేనని ఆమె ట్విట్టర్లో పేర్కొంది. భారతీయులు ఎప్పుడూ సమైక్యంగానే ఉండాలని, 'విభజించు పాలించు' అన్న బ్రిటిష్ వాదంతో మనవాళ్ళు నష్టపోరాదని తెలిపింది. అమీషా వ్యాఖ్యల పట్ల తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గురించి తెలియకుండా మాట్లాడడం మంచిదికాదని వారు హితవు పలికారు. దీనిపై అమీషా ప్రతిస్పందిస్తూ, ఏది మంచో ఏది చెడో ప్రజలే అర్థం చేసుకుంటారని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News