: సీఎం కిరణ్ సంచలన వ్యాఖ్యలు


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రేపే (గురువారం) ఆఖరి రోజు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీకి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లునే, అదే ఫార్మాట్ లో లోక్ సభలో కూడా ప్రవేశపెడుతున్నందున...ఇక ముఖ్యమంత్రిగా కొనసాగడం అనవసరమని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ తో కిరణ్ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇదే విషయం గురించి సీఎం కిరణ్ ను మీడియా ప్రశ్నించగా.. ముఖ్యమంత్రిగా రేపే ఆఖరి రోజు కావచ్చునని బదులిస్తూ నవ్వుతూ వెళ్లిపోయారు. అయితే, దీనికి సంబందించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఆది నుంచి సీఎం కిరణ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News