: ప్రజాస్వామ్యం పట్టాలు తప్పింది: వెంకయ్యనాయుడు
లోక్ సభలో ఎనిమిది రోజుల నుంచి జరుగుతున్న ఆందోళన, ప్రధానంగా ఈ రోజు సభలో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రధాని, కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లే మంత్రులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితి మనసును కలిచివేస్తుందన్న ప్రధానికి హృదయం ఉందా? అని ప్రశ్నించారు. యూపీఏ పాలనపై సోనియా, మన్మోహన్ ఆత్మావలోకనం చేసుకోవాలని వెంకయ్య సూచించారు.