: 'రికార్డు' హీరోను ఎగరేసుకెళ్ళిన ముంబయి ఇండియన్స్
ఐపీఎల్-7 వేలంలో కొందరు క్రికెటర్లకు భారీ ధర పలుకుతోంది. ఉదయం వేలం ఆరంభంలో యువరాజ్ రూ.14.5 కోట్లకు అమ్ముడవగా, కెవిన్ పీటర్సన్ రూ.9 కోట్లు పలికాడు. తాజాగా, వన్డేల్లో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ బాది అందరి కళ్ళను తనవైపుకు తిప్పుకున్న న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కోరే ఆండర్సన్ ను ముంబయి ఇండియన్స్ చేజిక్కించుకుంది. వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ కోసం ముంబయి ఫ్రాంచైజీ రూ.4.5 కోట్లు కుమ్మరించింది. ఈ యువ ఆటగాడు ఇటీవలే విండీస్ తో వన్డేలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు పుటల్లోకెక్కిన సంగతి తెలిసిందే.