: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత
సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ వ్యతిరేకించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలని చూడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు అమలు చేయాలనుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనని తెలిపారు. తెలంగాణ కోరుతున్న వారి సంఖ్య తక్కువ అని అన్నారు. ఎన్ని నివేదికలు, కమిటీలు వేసినా అన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చెప్పాయని ఆయన గుర్తు చేశారు. వాటన్నింటినీ తుంగలో తొక్కి విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.