: ఇది భారత జాతికే సిగ్గుచేటు: రాజేంద్ర ప్రసాద్
పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాలు భారత జాతికే సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో పలు అంశాలపై అవిశ్రాంత పోరాటం చేసిన తెలుగు జాతిని నాశనం చేయడానికే సోనియా గాంధీ రాష్ట్ర విభజన వివాదాన్ని రేపారని అన్నారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పరస్పరం దాడులు చేసుకునే దుస్థితి కల్పించిన సోనియా గాంధీకి తెలుగుజాతిపై ఉన్న కడుపు మంట చల్లారి ఉంటుందని ఆయన అన్నారు.