: ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవు: పళ్లంరాజు
పార్లమెంటులో జరుగుతున్న సంఘటనల పట్ల కలత చెందుతున్నానన్న ప్రధాని వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పళ్లంరాజు తప్పుపట్టారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవని అన్నారు. కలత చెందుతున్నప్పుడు బిల్లు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టాలని తొందరపడుతున్నారని ఆయన పశ్నించారు. ఇప్పడున్న బిల్లు వల్ల సీమాంధ్రలో అన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని అందరూ చెబుతున్నా హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. నిర్లక్ష్యం చేస్తుంటే పోరాటం చేయక ఏం చేయాలి? అని ఆయన అడిగారు. అందుకే అధిష్ఠానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని అన్నారు.