: ముగిసిన ఆటో ఎక్స్ పో.. స్పందన అద్భుతం
నోయిడాలో జరుగుతున్న 12వ ఆటో ఎక్స్ పో ఘనంగా ముగిసింది. 5.61లక్షల మంది దీన్ని సందర్శించారు. దేశ విదేశీ కంపెనీలు 70 వాహనాలను ఇందులో ఆవిష్కరించాయి. గత కొంత కాలంగా పడిపోయిన వాహన విక్రయాలతో దిగాలుపడ్డ దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఈ ప్రదర్శన కాస్త ఉత్తేజాన్ని ఇచ్చింది.