: హైదరాబాద్ ను యూటీ చేయాలి: చిరంజీవి
హైదరాబాదు నగరాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేసి, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులుగా తాము గొంతెమ్మ కోరికలు కోరలేదని, న్యాయమైన కోరికలే కోరామని తెలిపారు. రాజధాని లేని సీమాంధ్రకు రాజధాని కావాలని అడగడం కూడా తప్పంటే ఎలా? అని ఆయన తెలిపారు. తాము అధిష్ఠానానికి వ్యతిరేకం కాదని, అధిష్ఠానం ఎంచుకున్న దారిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చిరంజీవి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేసి, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు.