: రూపు రేఖలను మించిన అందం ఉండాలి: కత్రినాకైఫ్
శారీరక అందచందాలకు మించిన అందం అవసరమని నటి కత్రినా కైఫ్ అంటోంది. ఒక మహిళగా అందాన్ని మించిన గుర్తింపు వేరొకటి ఉండాలని ఆమె అభిప్రాయపడింది. షూటింగుల సమయంలో మేకప్ కోసం గంటల తరబడి సమయం వెచ్చించాల్సి రావడం చాలా కష్టమైన పనని.. ఆ సమయంలో సరదా కబుర్లతో కాలక్షేపం చేస్తానంటోంది. చర్మాన్ని తాజాగా ఉంచుకోవడం, శిరోజాలను మెరిసేలా కాపాడుకోవడం ఇబ్బందికరమైన పనిగా అభిప్రాయం వ్యక్తం చేసింది .