: రెండో రోజు ముగిసిన నన్నపనేని దీక్ష


టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి 48 గంటల దీక్ష ముగిసింది. రాష్ట్ర విభజనకు నిరసనగా నన్నపనేని దీక్షకు దిగారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. రాష్ట్రపతి కూడా సీమాంధ్ర ప్రజల శ్రేయస్సును కాంక్షించలేదని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప ప్రజల పక్షాన అలోచించడం లేదని ఆమె మండిపడ్డారు. నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.

  • Loading...

More Telugu News