: శ్రీకాకుళంజిల్లాలో అగ్నిప్రమాదం, మహిళ సజీవ దహనం, 70 పూరిళ్లు ఆహుతి
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బిషని గ్రామంలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. 70 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది. స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.