: సభలో తీరుతో నా హృదయం ద్రవిస్తోంది: ప్రధాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా లోక్ సభలో ఎంపీల నిరసన, ముష్టి ఘాతాలతో ప్రధాని మన్మోహన్ సింగ్ చలించిపోయారు. సీమాంధ్ర ఎంపీలు పలువురు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగగా.. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఇద్దరు ముష్టిఘాతాలకు దిగారు. దీంతో సభలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే తన హృదయం ద్రవిస్తోందని ప్రధాని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టని అన్నారు.