: బిల్లు ప్రవేశపెట్టనీయం..రేపు యుద్ధమే: రాయపాటి
రేపు పార్లమెంటులో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనీయమని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రేపు ఇంతకంటే తీవ్రమైన పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ బిల్లును అడ్డుకునేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. 35 మంది ఎంపీలు రేపు అవిశ్వాస తీర్మానం ఇస్తారని ఆయన తెలిపారు.
తమ డిమాండ్లను కనీసం పట్టించుకోవడంతో తాము ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి తీసుకొచ్చిన తమకు సోనియా గాంధీ ఘన సన్మానం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోకతప్పదని రాయపాటి స్పష్టం చేశారు. రేపు ఏది ఏమయినా బిల్లును అడ్డుకుంటామని, అందుకు ప్రారంభంగానే కేంద్ర మంత్రులు వెల్ లోకి దూసుకొచ్చారని, రేపు మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని కావురి వెల్లడించారు.